facebook pixel
chevron_right Top
transparent
కాంగ్రెస్ నేతలకు కంటిపరీక్షలు చేయించాలి: తలసాని
కంటివెలుగు పరీక్షలు ముందుగా కాంగ్రెస్ నేతలకు చేయించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ ఒకే రోజు 28 శంకుస్థాపనలు చేశారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.600కోట్లు ఇచ్చారని తెలిపారు. ఎస్సార్‌నగర్‌లో రూ.38కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతోందని వివరించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. జలవిహార్‌లో సనత్‌నగర్ కార్యకర్తల విస్త్రృతస్థాయి సమావేశంలో తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ ప్రసంగించి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App