facebook pixel
chevron_right Top
transparent
మహాకూటమి కాదు.. స్వాహా కూటమి:కేటీఆర్
తెలంగాణలో ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకు సిద్ధమని అన్నారు. ఇప్పుడు ఎన్నికలంటేనే విపక్షాలు వణికిపోతున్నాయి. అని మంత్రి కేటీఆర్ అన్నారు. జలవిహార్‌లో సనత్‌నగర్ కార్యకర్తల విస్త్రృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రాజెక్టులను ఆపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతోంది. విపక్షాలకు ఓటమి తప్పదని తెలిసే కుంటిసాకులు చెబుతున్నారు. 2002లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలకు పోలేదా? రాష్ర్టాలు కేంద్రంపై ఆధారపడటం లేదని. రాష్ర్టాలపైనే కేంద్రం ఆధారపడుతోందని విమర్శించారు. బీజేపీ హయాంలో బ్యాంకులంటేనే ప్రజలు భయపడుతున్నారు. ప్రజలకు పంచుతామని ప్రధాని మోదీ అన్నారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఎంతమందికి పంచారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App