facebook pixel
chevron_right Top
transparent
క‌ల్ప‌వృక్ష‌ వాహనంపై బ‌కాసుర వ‌ధ‌ అలంకారంలో శ్రీమలయప్ప
శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం శ్రీమలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి క‌ల్ప‌వృక్ష‌ వాహనంపై బ‌కాసుర వ‌ధ‌ అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App