facebook pixel
chevron_right Top
transparent
ప్రణయ్ హత్య కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్, పోలీసుల అదుపులో 5గురు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో కాంగ్రెస్ నేత కరీం సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతీరావు, అతడి తమ్ముడు శ్రవణ్ కుమార్, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కరీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. చదవండి: నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్‌పై గతంలోను. ప్రణయ్‌ని హత్య చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ కూతురును ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాంగ్రెస్ నేత కరీంను విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App