facebook pixel
chevron_right Politics
transparent
జగన్‌కు అడుగడుగునా వినతుల వెల్లువ
ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం 263వ రోజు ప్రజాసంకల్పయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి జంక్షన్‌ నుంచి ప్రారంభమైంది. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీనిలో భాగంగా బాక్సింగ్‌ క్రీడాకారిణి బగ్గు మౌనిక జననేతను కలిశారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ. విజయాలు సాధించినపుడు ప్రభుత్వం సన్మానాలు చేస్తోందని. అంతకంటే ముందు ఎలాంటి ప్రోత్సాహం అందించటం లేదని మండిపడ్డారు. తనకు స్పాన్సర్‌ షిప్‌ కావాలని జననేతను ఆమె కోరారు. మౌనిక జాతీయ స్థాయిలో పది ఈవెంట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఒక ఈవెంట్‌లో పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ ఎస్‌ ఆర్‌ పురం క్రాస్‌ మీదుగా డబ్బండ క్రాస్‌కు చేరుకున్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App