facebook pixel
chevron_right Politics
transparent
'చంద్రబాబు మోసాలకు మరోసారి బలికావొద్దు'
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రి చంద‍్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం ఉన్నా లేకపోయినా ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పనులను గత ప్రభుత్వం 89 శాతం పూర్తి చేస్తే, తానే చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. దీనిలో భాగంగా మరోసారి చంద్రబాబు మోసాలకు బలికావొద్దని ప్రజలకు బొత్స విజ్ఞప్తి చేశారు. పార‍్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు. ముందస్తు ఎన్నికలపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App