facebook pixel
chevron_right Top
transparent
తాడిప‌త్రిలో కొనసాగుతున్న ఉద్రిక్త‌త‌...రోడ్డుపై బైఠాయించిన ఎంపీ జేసీ
అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. శ‌నివారం వినాయక నిమజ్జనం సందర్భంగా ఇక్కడి ప్రబోధానంద స్వామి వర్గీయులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి చిన్నపొడమల గ్రామస్తులకు మద్దతుగా ఈ రోజు రోడ్డుపై బైఠాయించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వినాయక నిమజ్జనం ట్రాక్టర్లు తమ ఆశ్రమం మీదుగా పోకూడదని ప్రబోధానంద స్వామి అనుచరులు, అటునుంచే తీసుకు వెళతామని గ్రామస్తులు పట్టుపట్టడమే వివాదానికి కారణం. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చిన్నపొడమల గ్రామానికి చేరుకున్న అనంతపురం ఎంపి జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్తులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App