facebook pixel
chevron_right Top
transparent
సిఎంగా జగన్ ను ఎపి ప్రజలు కోరుకుంటున్నారా?...సర్వేపై మండిపడ్డ టిడిపి నేతలు
ప్రతిపక్ష నేత జగన్ ని ఏపి ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని సర్వేలో తేలిందంటూ ఇండియా టుడే ఛానల్ లో వార్తలు ప్రసారం కావడంపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. బిజెపితో కలిసి నాటకాలు ఆడుతున్న జగన్‌కు ఏమి అనుభవం ఉందని, రాష్ట్రానికి ఏమి చేశారని ఆయనను ఎపి ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటారని సిఎం చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఎచ్చెర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బిజెపి,వైసిపిలపై మండిపడ్డారు. ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ కేంద్రం తప్పుడు సర్వేలు చేయిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ అనుకూల ఛానెల్స్ ద్వారా తప్పుడు సర్వేలు చేయిస్తోందని ఆరోపించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App