facebook pixel
chevron_right Top
transparent
జీపు నడుపుతూ నీటివిడుదల, పొలాలను పరిశీలించిన పోచారం
నిజాంసాగర్ కాలువలకు నీటి విడుదలను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించారు. నిజాంసాగర్ ప్రధాన కాల్వ డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థల ద్వారా పంట పొలాలకు అందుతున్న నీటిని మంత్రి పరిశీలించారు. నిజాంసాగర్ ఆయకట్టులో మొత్తం 1.20 లక్షల ఎకరాల్లో రైతులు పొలాలను సాగు చేశారు. సీఎం కేసీఆర్ అనుమతితో నిన్న ఉదయం నుంచి నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు పోచారం పేర్కొన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 2 టీఎంసీల నీరు ఉంది. మొదటి విడతగా ఈనెల 24 వరకు నీటి సరఫరా జరుగుతుంది. వారం రోజులు నిలిపివేసి మరో తడి కోసం అక్టోబర్ 1 నుంచి 10 వరకు అందిస్తామని వెల్లడించారు. రైతులు కూడా అధికారులకు సహకరిస్తూ నీటిని పొదుపుగా వాడాలని సూచించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App