facebook pixel
chevron_right Top
transparent
రేప్ కేసు, బాధ్యతల నుంచి తప్పుకున్న బిషప్, కేరళ పోలీసుల నోటీసులు, రండి!
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈనెల 13వ తేదీన బిషప్ ఫ్రాంకో ములక్కల్ డయోసిస్ పరిపాలనను మాన్ సిగ్నోర్ మాథ్యూ కొక్కండమ్ కు అప్పగించారని తాజాగా వెలుగు చూసింది. కేరళ పోలీసులు నోటీసులు జారీ చెయ్యడంతో బిషప్ బాధ్యతలు మరొకరికి అప్పగించారు. బిషప్ ఫ్రాంకో ములక్కల్ జారీ చేసిన సర్య్కూలర్ మూడు రోజులు ఆలస్యంగా వెలుగు చూసింది. 2014 నుంచి 2016 మధ్య కాలంలో 13 సార్లు బిషప్ ఫ్రాంకో ములక్కల్ తన మీద అత్యాచారం చేశారని కేరళకు చెందిన నన్ ఆరోపణలు చేశారు. బిషప్ ఫ్రాంకో ములక్కల్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App