facebook pixel
chevron_right Top
transparent
బౌద్ధ మత గురువులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న సంగతి 1990లోనే తెలుసు: దలైలామా
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. బౌద్ధమతానికి చెందిన గురువులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న విషయం తనకు తెలుసనని దలైలామా చెప్పారు. అది ఈనాడు కొత్తగా వచ్చింది కాదని 1990వ దశకం నుంచే ఇలాంటి వ్యవహారాల గురించి తనకు తెలుసునని చెప్పారు దలైలామా. టిబెట్‌కు చెందిన ఈ ఆధ్యాత్మిక గురువు నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ బౌద్ధ గురువులచే లైంగిక వేధింపులకు గురైన బాధితులను ఆయన కలిశారు. కలిసిన సందర్భంగా పైవ్యాఖ్యలు చేశారు దలైలామా. క్షమాపణలు చెప్పిన దలైలామా బౌద్ధగురువుల చేతిలో లైంగిక వేధింపులకు గురైన తమకు దలైలామాను కలిసి తమ బాధను చెప్పుకునేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతూ బాధితులు పిటిషన్ పెట్టుకున్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App