facebook pixel
chevron_right Top
transparent
కేటీఆర్‌కే మా ఓటు.. గ్రామస్థుల ప్రతిజ్ఞ!
టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు వెల్లువలా మద్దతు పలుకుతున్నారు. గ్రామాలకు గ్రామాలు, వివిధ కులసంఘాలు, సంస్థలు స్వచ్ఛందంగా తమ మద్దతు ప్రకటిస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీకే మా ఓటు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేస్తున్నాయి. తీర్మాన ప్రతులను పార్టీ నాయకులకు అందజేస్తున్నాయి. ఆదివారం పలు నియోజకవర్గాల్లో అనేక తీర్మానాలు జరిగాయి. జిల్లాలోని వీర్న‌ప‌ల్లి మండలంలోని ఎర్ర‌గ‌డ్డ తండాకు చెందిన ప్ర‌జ‌లు మంత్రి కేటీఆర్‌కే మా ఓటు అని ప్రతిజ్ఞ చేశారు. దాదాపు 200 మంది ప్రతిజ్ఞ చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సిరిసిల్ల‌ నియోజకవర్గం నుంచి మంత్రి కేటీఆర్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గ్రామ‌స్థులంతా హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను మ‌రోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామ‌ని తెలిపారు. సిరిసిల్ల అభివృద్ధికి మంత్రి ఎంతో కృషి చేశార‌ని కొనియాడారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App