facebook pixel
chevron_right Top
transparent
రాజకీయాల్లో ఒక్కరే బాహుబలి.. అది ఒక్క సీఎం కేసీఆరే!
రేగొండలో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ. రాజకీయాల్లో ఒక్కరే బాహుబలి ఉంటారు. అది ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లను గెలుచుకునే సత్తా బీజేపీకి లేదని అన్నారు. బీజేపీకి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించిన ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ మళ్లీ ఏకం అవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి పురుడు పోసుకుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App