facebook pixel
chevron_right Politics
transparent
'ఇది న్యాయవ్యవస్థకు అవినీతి అంటగట్టే ప్రయత్నమే'
ఆంధ్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారంట్‌ను సైతం రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన భూమన. కోర్టు నోటీసులు పంపిన క్రమంలో కేసు విచారణకు హాజరుకాకపోతే చెప్రాసీకి కూడా వారంట్‌ను జారీ చేయడం సర్వ సాధారణమని, మరి అటువంటప్పుడు ఏదో కుట్ర జరిగిందని పచ్చ మాఫియా చిత్రీకరించడం సిగ్గు చేటన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్‌ కేసులో మహారాష్ట్ర కోర్టు నోటీసులు ఇస్తే. తనపై కుట‍్ర జరుగుతుందంటూ చంద్రబాబు చెప్పుకోవడం ఎంత వరకూ సమంజసమన్నారు. ఇది కచ్చితంగా న్యాయవ్యవస్థకు అవినీతి బురద అంటగట్టే ప్రయత్నమేన్నారు. న్యాయవ్యవస్థకే కళంకం తెచ్చే వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్‌ చేశారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App