facebook pixel
chevron_right Top
transparent
జేడీయూలో చేరిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
అంద‌రూ ఊహించిన‌ట్లుగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ అరంగ్రేటం చేశారు. కొన్నేళ్ల నుంచి పలు రాజ‌కీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారారు. పాట్నాలో డీయూ అధినేత, బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ సమక్షంలో ఇవాళ‌ జేడీయూలో చేరారు. ఆయనకు కండువా కప్పి నితీష్ పార్టీలోకి ఆహ్వానించారు. మళ్లీ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు ఇటీవ‌ల వెల్లడించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో భాగంగా తొలిసారి ప్రజలతో ముచ్చటించిన ఆయన 2019 ఎన్నికల ప్రచారంలో నేను భాగస్వామ్యం కాదల్చుకోలేద‌ని పేర్కొన్నారు. బిహార్‌కు చెందిన ప్రశాంత్ కిశోర్ గతంలో ఐక్యరాజ్యసమితి(ఐరాస‌)లో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేశారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా మారారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App