facebook pixel
chevron_right Top
transparent
ఔనా?...నిజమా?...ఎపి ప్రభుత్వం ఆ లాయర్ కు గంటకు రూ.33 లక్షలు చెల్లిస్తుందా?
సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఒక పోస్ట్ రాజకీయ శ్రేణుల్లోనే కాదు. సాధారణ ప్రజానికంలోనూ చర్చనీయాంశంగా మారింది. అది హై కోర్టు విభజనకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వంపై ఎపి గవర్నమెంట్ సుప్రీం కోర్టులో వేసిన ఒక కేసు విషయమై న్యాయవాదికి చెల్లిస్తున్న భారీ ఫీజు విషయం. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ నడుమ ఉమ్మడి హైకోర్టును విభజించే అంశం విషయమై వాజ్యం నడుస్తోంది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు ఏకంగా సుప్రీం కోర్టులో న్యాయపోరాటానికి దిగాయి. ఈ క్రమంలో ఈ కేసును ఎపి ప్రభుత్వం తరుపున వాదిస్తున్న న్యాయవాది ఫాలి నారిమన్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గంటకు 33 లక్షల రూపాయలు చెల్లిస్తోందట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App