facebook pixel
chevron_right Politics
transparent
సానుభూతి కోసం బాబు జిమ్మిక్కులు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ ఇవ్వడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని సర్వేపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. సానుభూతి కోసం చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను టీడీపీ నేతలు కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని సర్వేలు జగన్‌కు అనుకూలంగా వస్తుండటంతో చంద్రబాబు వెన్నులో భయం మొదలైందన్నారు. 2013 నుంచి 13 సార్లు మహారాష్ట్ర కోర్టు సమన్లు జారీ చేస్తూనే ఉందని వెల్లడించారు. ఇప్పటి వరకు 35 సార్లు ఇదే కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారని తెలిపారు. బీజేపీతో కలిసి ఉన్నపుడు వారెంట్‌ వస్తే అప్పుడు మభ్యపెట్టాడని, ఇప్పుడేమో నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ ఇస్తే కుట్ర చేసిందని వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App