facebook pixel
chevron_right Top
transparent
ఫ్యామిలీతో యూఎస్ వెళ్ళ‌నున్న మ‌హేష్‌
వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం మ‌హ‌ర్షి. దిల్‌రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వరాలు స‌మకూరుస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి అందాల నటి జయసుధ‌నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు 'మహర్షి'. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా రిషీ పాత్ర‌లో కనిపించనున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని ఓ స్టూడియోలో షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్ళ‌నుంది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App