facebook pixel
chevron_right Politics
transparent
చాణిక్యుడి రాజకీయ ప్రవేశం..!
ఎన్నికల వ్యూహాలు రచించడంలో దేశ రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌ (41) రాజకీయ ప్రవేశం చేయనున్నారు. బిహార్‌లోని ససారంకు చెందిన ప్రశాంత్‌ కిషోర్‌. ఆ రాష్ట్రా సీఎం నితీష్‌ కుమార్‌ సమక్షంలో ఆదివారం ఆయన పార్టీలో చేరతారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ముందే ఆయన పార్టీలో చేరతారని జేడీయూ నేతలు ధృవీకరించారు. దీంతో పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా ఆయన కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన కిషోర్‌ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాకర్తగా పనిచేసి నరేంద్ర మోదీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత కాంగ్రెస్‌, జేడీయూ,ఆర్జేడీ తరుఫున బిహార్‌లో మహాకూటమి తరుఫున పనిచేసి బీజేపీ ఓటమికి కారణమైయ్యాడు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App