facebook pixel
chevron_right Top
transparent
మాలీవుడ్‌కి అర్జున్ రెడ్డి..!
ఎలాంటి అంచ‌నాలు లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇప్పుడు ఈ చిత్రం చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా వ‌ర్మ అనే టైటిల్‌తో త‌మిళంలో రీమేక్ అవుతుంది. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా త‌మిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెర‌కెక్కిస్తున్నాడు. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజ‌యం సాధించ‌డంతో త‌మిళంలోను ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక హిందీలోను షాహిద్ క‌పూర్ హీరోగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధ‌మైంది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App