facebook pixel
chevron_right Top
transparent
కేరళ బ్లాస్టర్స్‌లో స‌చిన్ వాటా కొనేది ఎవ‌రంటే..
ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ జట్టు కేరళ బ్లాస్టర్స్‌ లో తన వాటాను భార‌త మాజీ క్రికెట‌ర్ సచిన్‌ టెండూల్కర్‌ త్వరలోనే విక్రయించబోతున్నాడు. ఆ జ‌ట్టులోని త‌న వాటాను అమ్మ‌నున్న‌ట్లు తాజాగా వెల్ల‌డించాడు. ఐఎస్‌ఎల్‌లో కేర‌ళ‌ బ్లాస్టర్స్‌ 2014లో ప్రవేశించింది. ఆనాటి నుంచి టీమ్‌తో సచిన్‌కు మంచి అనుబంధం ఉంది. 2018 సీజన్ ఆరంభ‌మ‌య్యే లోగా తన వాటాను అమ్మేయాలని సచిన్‌ నిర్ణయించుకొన్నట్టు ఐఎస్‌ఎల్ ప్ర‌తినిధి ఒకరు తెలిపారు. ఈ క్లబ్‌లో సచిన్‌కు తొలుత 40 శాతం వాటా ఉండగా. అందులో నుంచి 20శాతం వాటాను తెలుగు సినీ ప్రముఖులు కొందరు 2016లో కొనుగోలు చేశారు. ప్ర‌స్తుతం ఫ్రాంఛైజీలో 80శాతం వాటా తెలుగు ప్ర‌ముఖుల చేతిలోనే ఉంది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App