facebook pixel
chevron_right Top
transparent
నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్‌పై గతంలోను...
ప్రణయ్‌ హత్య కేసును సిటింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. హత్యకు కారకుడైన మారుతి రావు, శ్రవణ్‌లను మిర్యాలగూడ బహిష్కరించాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమృతను మందకృష్ణతో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. పరామర్శ అనంతరం మందకృష్ణ మాదిగ, ఎర్రోళ్ల మాట్లాడారు. కుల దురహంకార హత్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రణయ్‌ హత్యకు నిరసనగా శనివారం మిర్యాలగూడలో బంద్‌ నిర్వహించారు. ప్రణయ్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఉక్రెయిన్‌లో చదువుతున్న ప్రణయ్‌ సోదరుడు అజయ్‌ వచ్చిన అనంతరం ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అమృతపై ప్రేమతోనే చంపించా, 9వ తరగతిలోనే చెప్పా: ప్రణయ్ హత్యపై అమ్మాయి తండ్రి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App