facebook pixel
chevron_right Top
transparent
న‌వాబ్ 'నీలి క‌న్నుల్లో' ప్రోమో వీడియో సాంగ్
అంద‌మైన ప్రేమ క‌థా చిత్ర‌లు తెర‌కెక్కించే మ‌ణిర‌త్నం తాజాగా న‌వాబ్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ఈ చిత్రం చెక్క చివంత వానం (ఎర్రని ఆకాశం తెలుగులో)అనే టైటిల్‌తో విడుద‌ల కానుంది. అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, అదితి రావు హైద‌రి, డ‌యానా ఎర‌ప్పా, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ మ‌ల్టీ స్టార‌ర్ గా రూపొందుతుంది. మణి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్‌, లైకా ప్రొడక్షన్స్‌ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏ ఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App