facebook pixel
chevron_right Top
transparent
జూ. పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 5.69 లక్షల మంది దరఖాస్తు
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు గడువు శనివారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు చివరిరోజైన శనివారం సాయంత్రంవరకు 5,69,447 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సంఖ్య 12,751కి చేరింది. ప్రతిగ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 9,355 కొత్త పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష వచ్చే నెల 4న అన్ని జిల్లాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App