facebook pixel
chevron_right Top
transparent
కేశవాపూర్ రిజర్వాయర్ కు రైతుల సమ్మతి
నగర శివారు మేడ్చల్ జిల్లా పరిధిలోని కేశవాపూర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన రిజర్వాయర్ నిర్మాణణానికి కొంతవరకు లైన్ క్లియర్ అయింది. కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రైతులతో పలు దఫాలుగా జరిపిన చర్చలు శనివారం సఫలం అయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత క్లిష్టంగా మారిన భూసేకరణ ప్రక్రియకు అంగీకరిస్తున్నట్లు శనివారం జిల్లా కలెక్టర్ ముందు కీసర మండల పరిధిలోని యాకుత్‌పూర్ గ్రామ రైతులు అంగీకరించారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో కొంత వరకు మార్గం సుగుమం అయ్యిందని చెప్పవచ్చు. హైదరాబాద్ నగర ప్రజలతో పాటు మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సుమారు 10 టీఎంసీల సామర్థ్యంతో కేశవాపూర్ రిజర్వాయర్‌ను నిర్మించతలపెట్టిన సంగతి విదితమే.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App