facebook pixel
chevron_right Top
transparent
వ్యాధుల గుప్పెట గిరిజనం
గిరిజన ప్రాంతాల్లో అంటు వ్యాధుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. మరోవైపు కేన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులు, మానసిక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే విషయాన్ని ఆరోగ్యంపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ నివేదికలో వెల్లడించింది. 2013లో గ్రామీణ వైద్య నిపుణుడు డాక్టర్‌ అభయ్‌ బంగ్‌ నేతృత్వంలో ఆరోగ్య, గిరిజన శాఖలు ఏర్పాటు చేసిన ఈ కమిటీ. గత ఆగస్టులో నివేదిక సమర్పించింది. స్వాతంత్య్రానంతరం గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై ఇలాంటి నివేదిక రావడం ఇదే తొలిసారి. 'ట్రైబల్‌ హెల్త్‌ ఇన్‌ ఇండియా'శీర్షికన వెలువడిన ఈ నివేదిక ప్రకారం. జనాభాలో 8 శాతం ఉన్న గిరిజనుల్లో 30 శాతం మలేరియా కేసులు నమోదవుతున్నాయి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App