facebook pixel
chevron_right Politics
transparent
బాబువన్నీ అవకాశవాద విధానాలే
నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు రాష్ట్రానికి ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాగ్రహం పెరగడంతో బీజేపీపై నెపం నెట్టి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాడుతున్నట్టు చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారని సురవరం ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విజయవాడలో శనివారం 'మహాగర్జన' బహిరంగ సభ నిర్వహించాయి. సభలో సురవరం మాట్లాడుతూ చంద్రబాబువి మొదటి నుంచి అవకాశ విధానాలేనన్నారు. నాలుగేళ్లుగా నిరుద్యోగభృతి గురించి పట్టించుకోని బాబు మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో ఇప్పుడు యువనేస్తం ప్రారంభించి ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App