facebook pixel
chevron_right Sports
transparent
'శాఫ్‌' కప్‌ ఫైనల్లో భారత్‌కు షాక్‌
దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (శాఫ్‌) కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌కు భంగపాటు ఎదురైంది. అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైన భారత జట్టు ఫైనల్లో 1-2తో మాల్దీవులు చేతిలో ఓడింది. గ్రూప్‌ దశలో 2-0తో మాల్దీవులను ఓడించిన భారత్‌ శనివారం జరిగిన తుదిపోరులో మాత్రం తడబడింది. ఆద్యంతం భారత్‌ ఆధిపత్యమే కొనసాగినా విజయం మాత్రం ప్రత్యర్థిని వరించింది. వచ్చిన కొద్దిపాటి అవకాశాలను చక్కగా వినియోగించుకున్న మాల్దీవులు రెండో సారి శాఫ్‌ కప్‌ను ఎగరేసుకుపోయింది. భారత్‌ తరఫున సుమీత్‌ పస్సీ (92వ ని.లో) ఏకైక గోల్‌ చేయగా. మాల్దీవులు తరఫున ఇబ్రహీం (19వ ని.లో), అలీ ఫసీర్‌ (66వ ని.లో) చెరో గోల్‌ చేశారు. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్‌ చేరిన భారత్‌ తుదిపోరులో సమన్వయ లోపంతో చతికిలపడింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App