facebook pixel
chevron_right Politics
transparent
మన ఇంజనీర్లకు ఏం తక్కువ?
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఎంతో మంది మేధావులైన ఇంజినీర్లు ఉండగా, సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పనులను సింగపూర్, జపాన్, ఇతర దేశాల కంపెనీలకు అప్పగిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లలో ఉన్నదేమిటని ప్రతి ఇంజినీరింగ్‌ విద్యార్థి అడుగుతున్నాడని, దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 262వ రోజు శనివారం ఆయన మార్గం మధ్యలో విశాఖ శివార్లలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో 'ఇంజినీర్స్‌ డే' సందర్భంగా ఇంజినీరింగ్‌ వృత్తి నిపుణులు, విద్యావంతులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App