facebook pixel
chevron_right Top
transparent
నిధుల కోసం కేంద్రాన్ని అడుక్కోకండి
విద్యాసంస్థలు నిధుల కోసం ప్రభుత్వాన్ని అడుక్కునే బదులు తమ పూర్వ విద్యార్థులను ఆశ్రయించాలని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ సూచించారు. శుక్రవారం ఇక్కడి జ్ఞాన ప్రబోధిని పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ 'ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల నుంచి వర్సిటీల వరకు ఎవరు నడుపుతున్నారు? అక్కడ చదువుకుని ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన పూర్వ విద్యార్థులే'అని ఆయన పేర్కొన్నారు. పలు విద్యాసంస్థలు సాయం కోసం విరామం లేకుండా ప్రభుత్వాన్ని అడుక్కుంటాయని, కానీ నిజమైన సాయం వారి వద్దే ఉందని చెప్పారు. తాము చదుకున్న పాఠశాలలు, కాలేజీల అభివృద్ధికి విరాళాలు ఇవ్వడం ఓ బాధ్యతగా తీసుకోవాలని ఆయన కోరారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App