facebook pixel
chevron_right Politics
transparent
15 రోజుల్లో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో
మేనిఫెస్టో రూపకల్పనకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) కసరత్తు ముమ్మరం చేసింది. మరో 15 రోజుల్లో మేనిఫెస్టోను తయారు చేయనుంది. ఈ మేరకు మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు అధ్యక్షతన శనివారం ఇక్కడి తెలంగాణ భవన్‌లో జరిగింది. మొత్తం 15 మంది సభ్యులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సూచన మేరకు శేరి సుభా ష్‌రెడ్డిని కమిటీలో కొత్తగా చేర్చారు. సమావేశంలో 20 అంశాలపై చర్చ జరిగింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన 170 వినతిపత్రాల పరిశీలన మొదలైంది. మరో నాలుగుసార్లు కమిటీ సమావేశం కానుంది. అనంతరం ముసాయిదా ప్రతిపాదనలపై కేసీఆర్‌తో చర్చించి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. తర్వాత కేసీఆర్‌ అధికారికంగా మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App