facebook pixel
chevron_right Politics
transparent
పొత్తుతో గెలిచినా ఉండరు: తలసాని
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీ అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని మంత్రి తలసాని శ్రీని వాస్‌ యాదవ్‌ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ క్యాడర్‌ లేని పార్టీలని ఆ రెండు పార్టీల పొత్తుతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. పొత్తులో టీడీపీ నుంచి ఇద్దరు ముగ్గురు గెలిచినా ఆ పార్టీలో ఉండరన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 6 నెలల క్రితమే చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారని పొత్తు పర్యవసానాలను ఆయన రాబోయే రోజుల్లో అనుభవిస్తారని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్‌ ఆత్మను క్షోభ పెడుతున్న బాబును ఆయన అభిమానులు, కార్యకర్తలు క్షమించరన్నారు. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చంద్రబాబు మీద కుట్ర పన్నాయని టీడీపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App