facebook pixel
chevron_right Top
transparent
గాంధీజీ కలను నిజం చేద్దాం
స్వచ్ఛతా ఉద్యమంలో పాలుపంచుకునేవారు వారు గాంధీజీకి నిజమైన వారసులుగా నిలిచిపోతారని, జాతిపిత కలైన స్వచ్ఛ భారత్‌ను నిజం చేసేలా ప్రజలు పునరంకితం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అపరిశుభ్రత నుంచి ఆరోగ్య భారతాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని. ఒంటరిగా ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధించలేదని, అందరూ సహకరించాలని ఆయన కోరారు. 'స్వచ్ఛతా హీ సేవ'(స్వచ్ఛతే సేవ) ప్రచార ఉద్యమాన్ని ప్రధాని శనివారం ప్రారంభించారు. వచ్చే నెల అక్టోబర్‌ 2 వరకూ ఇది కొనసాగుతుంది.పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా దేశ ప్రజల్ని ప్రోత్సహించేందుకు అక్టోబర్‌ 2, 2015న స్వచ్ఛతా సేవను ప్రధాని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలతో పాటు మత, ఆధ్యాత్మిక గురువులు, పలువురు ప్రముఖులతో దాదాపు రెండు గంటలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ సంభాషించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App