facebook pixel
chevron_right Top
transparent
ఆదాయం, ఆయుష్షు భేష్‌
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారత్‌. మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)లోనూ ముందడుగు వేస్తోంది. వివిధ అంశాల్లో గతంతో పోలిస్తే తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. గత రెండున్నర దశాబ్దాల్లో హెచ్‌డీఐలో గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 1990లో భారత్‌ హెచ్‌డీఐ విలువ 0.427 ఉండగా 2017 నాటికది 0.640కు పెరిగింది. అలాగే అదే కాలానికి భారతీయుల ఆయుర్దాయం 11 ఏళ్లు మెరుగుపడింది. తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అయితే లింగ సమానత్వం మాత్రం ఆందోళనకరంగా ఉందని నివేదిక తెలిపింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App