facebook pixel
chevron_right Entertainment
transparent
సత్తి హీరో అయ్యాడోచ్‌
యాంకర్‌గా, నటుడిగా ఫేమస్‌ అయిన 'బిత్తిరి' సత్తి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'తుపాకి రాముడు'. ప్రభాకర్‌ దర్శకత్వంలో రసమయి బాలకిషన్‌ నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్, ఫస్ట్‌ లుక్‌ను దర్శకుడు సుకుమార్‌ రిలీజ్‌ చేసి మాట్లాడుతూ- బిత్తిరి సత్తి'గా పరిచయమైన సత్తి ఈ సినిమాతో మరో కోణంలో కనిపిస్తున్నారు. నాకు పరిచయమైన తొలి దర్శకుడు ప్రభాకర్‌గారు. ఎంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించి ఉంటారనుకుంటున్నాను. ఈ సినిమా అందరికీ మంచి పేరు, సక్సెస్‌ తేవాలని కోరుకుంటున్నాను అన్నారు. యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సత్తిని కొత్త కోణంలో చూపిస్తున్నాం. బాలకిషన్‌గారు రాజీ పడ కుండా నిర్మించారు అన్నారు టి.ప్రభాకర్‌. సత్తిని హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App