facebook pixel
chevron_right Top
transparent
హర్యానా గ్యాంగ్‌రేప్ కేసు.. నిందితుల్లో ఆర్మీ జవాన్
హర్యానాలో సీబీఎస్‌ఈ టాపర్, సెకండియర్ విద్యార్థిని (19)పై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటనలో ముగ్గురు యువకుల్లో ఆర్మీ జవాన్‌ను ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. ముగ్గురు నిందితుల ఫొటోలను శనివారం విడుదల చేశారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ప్రకటించారు. ఇప్పటికీ బాధితురాలు అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ఘటన జరిగి 3 రోజులైనా నిందితులను అరెస్టుచేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలుపాలని హర్యా నా డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది. ఈ కేసు విచారణను సుమోటోగా స్వీకరించామని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ తెలిపారు. రాజస్థాన్‌లోని ఆర్మీ యూనిట్‌లో పనిచేసే పంకజ్ ఫౌజీ కూడా ఈ కేసులో నిందితుడు. అతడి అరెస్టు కోసం ప్రత్యేక పోలీస్ బృందం రాజస్థాన్‌కు వెళ్లింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App