facebook pixel
chevron_right Top
transparent
టికెట్ లేదని జరిమానా విధించిన టీసీ
తప్పించుకునే క్రమంలో రైలు కిందపడి యువకుడి దుర్మరణంనవాబుపేట: రైలులో ప్రయాణిస్తూ టీసీ విధించిన జరిమానా నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు రైలుకింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట గుల్లగూడ రైల్వేస్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్నది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. వికారాబాద్ మండలం లక్ష్మీనగర్‌కు చెందిన కాట్రావత్ శివ ఉదయం సికింద్రాబాద్ వెళ్లే పుష్‌ఫుల్ రైలు ఎక్కాడు. గుల్లగూడ సమీపంలో టీసీ టికెట్ అడుగగా లేకపోవడంతో రూ.500 జరిమానా కట్టాలన్నాడు. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు చక్రాల కింద పడిపోవడంతో తల, మొండెం వేరై ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి మృతికి టీసీనే కారణమంటూ తోటి ప్రయాణికులు టీసీని చితకబాదారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App