facebook pixel
chevron_right Entertainment
transparent
మాలో విభేదాలు లేవు!
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా)లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారంపై అధ్యక్షుడు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ నరేష్ పరస్పరం ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం సమసిపోయిందని, ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని స్పష్టం చేశారు శివాజీరాజా, నరేష్. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ తెలుగు చిత్రసీమ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్, ఫిల్మ్‌ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ఇంకా ఇతర విభాగాల సమాహారం. వీరిలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కలెక్టివ్ బాడీ ద్వారా పరిష్కరించుకోవాలనే నిర్ణయానికొచ్చాం. ఇటీవల మాలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా చర్చించాం. మాలో ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App