facebook pixel
chevron_right Entertainment
transparent
'మా' సమస్య పరిష్కారమైంది
'మా' (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ 'మా' జనరల్‌ సెక్రటరీ నరేశ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, నరేశ్‌ మధ్య వాగ్వివాదాలు జరిగాయి. ఈ వివాదం త్వరగానే సద్దుమణిగింది. ఇండస్ట్రీ ప్రముఖులం 'తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్‌ కమిటీ' ఏర్పరచుకొని, జరిగిన సమస్యను పరిష్కరించుకున్నాం అంటూ శనివారం ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ - మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్, ఫెడరేషన్, ఫిల్మ్‌ చాంబర్, కౌన్సిల్‌ మరికొన్ని. వాటిన్నింటిని కలిపితేనే తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ. ఇటీవల మా మధ్యలో కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దాని కోసం అందరం కలసి ఓ సపరేట్‌ బాడీ ఏర్పర్చుకున్నాం. ఏదైనా ఇష్యూ ఉంటే ముందు మాలో మేం మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App