facebook pixel
chevron_right Business
transparent
ఈ ఏడాది రూ.1.5 లక్షల కోట్ల ఎన్‌పీఏల వసూళ్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.1.5 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేసే అవకాశం ఉన్నదని కేంద్రం భావిస్తున్నది. గతేడాది వసూలైన రూ.74 వేల కోట్లతో పోలిస్తే రెట్టింపు కావచ్చని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. ఇప్పటికే నిరర్థక ఆస్తులపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాయని, ఈ ఏడాదిలో కూడా మెరుగైన పనితీరుతో వసూళ్లు పెరిగేందుకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్-జూన్‌లో మొండి బకాయిలు రూ.10.25 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రుణాల వసూళ్లకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే బ్యాంకులకు కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇదే సమయంలో దివాలా చట్టం కూడా ఎన్‌పీఏ వసూళ్లకు దన్నుగా నిలుస్తున్నది. తొలి త్రైమాసికంలో రూ.36,500 కోట్లను రికవరీ చేసిన బ్యాంకులు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App