facebook pixel
chevron_right Business
transparent
హైదరాబాద్‌లో రియల్ అడ్వైజర్ షో
ప్రముఖ స్థిరాస్తి రంగ మాసపత్రిక రియల్ అడ్వైజర్ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రాపర్టీ షోను శనివారం ప్రారంభించింది. అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో ఆదివారం కూడా కొనసాగుతున్నదని రియల్ అడ్వైజర్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ కే లక్ష్మీ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. వరుసగా సెలవు దినాలు కావడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కొనుగోలుదారులతో షో కళకళలాడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం శరవేగంగా దూసుకుపోతున్న నేపథ్యంలో సొంత ఇల్లును సమకూర్చుకోవడం, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడం అన్ని విధాలుగా లాభదాయకమని ఆయన సూచించారు. ఈ ప్రాపర్టీ షోలో రాష్ర్టానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు తమ ప్రాజెక్టులను ప్రదర్శించాయి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App