facebook pixel
chevron_right Sports
transparent
కిలిమంజారో అధిరోహణకు ఫిరోజ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం, కొటారి(కొత్తగూడ) గ్రామానికి చెందిన షేక్ ఫిరోజ్ ప్రఖ్యాత కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికయ్యాడు. కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించేందుకు ఫిరోజ్ ఈనెల 19న దక్షిణాఫ్రికాకు బయలుదేరనున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు భువనగిరిలో జరిగిన జూనియర్ రాక్ ైక్లెంబింగ్ పోటీల్లో ఫిరోజ్ ద్వితీయస్థానంలో నిలిచాడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాక్ ైక్లెంబింగ్‌లో ఫిరోజ్‌కు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఈ క్రమంలోనే ఫిరోజ్ ఈనెలాఖరులో దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించే భారత బృందంలో చోటు దక్కించుకున్నాడు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App