facebook pixel
chevron_right Sports
transparent
భారత్ గోల్స్ వర్షం
ఆసియాకప్ హాకీలో బంగ్లాపై ఘన విజయం. ఢాకా: టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్. ఆసియా కప్‌లో మరోసారి చెలరేగిపోయింది. తమకంటే చిన్నస్థాయి ప్రత్యర్థులపై గోల్స్ వర్షం కురిపించింది. అంతకుమించిన అటాకింగ్‌తో ఆకట్టుకున్న ప్రపంచ ఆరోర్యాంకర్ టీమ్‌ఇండియా శుక్రవారం జరిగిన పూల్-ఎ లీగ్ మ్యాచ్‌లో 7-0 గోల్స్ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. భారత్ తరఫున గుర్జాంత్ సింగ్ (7వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (10వ ని.), లలిత్ ఉపాధ్యాయ్ (13వ ని.), అమిత్ రోహిదాస్ (20వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ , రమన్‌దీప్ సింగ్ (46వ ని.) గోల్స్ చేశారు. ఆరంభం నుంచి ఆఖరు వరకు ఒకే రకమైన ఆటతీరుతో చెలరేగిన టీమ్‌ఇండియాను ఏ దశలోనూ బంగ్లా అడ్డుకోలేకపోయింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App