facebook pixel
chevron_right Business
transparent
సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సీఈవో రాజీనామా
చరవాణులు, గృహోపకరణాల తయారీ దిగ్గజం సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి క్వొన్‌ ఓ హున్‌ తన పదవికి రాజీనామా చేశారు. మూడో త్రైమాసికంలో చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో సంస్థ లాభాలు సాధించిందని తెలిసినా, అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సామ్‌సంగ్‌ గ్రూప్‌ వారసుడు లీజే యోంగ్‌ ఇటీవలే అవినీతి కేసులో దోషిగా తేలి ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అంతకు ముందు గెలాక్సీ నోట్‌7 స్మార్ట్‌ ఫోన్ల బ్యాటరీలు పేలుతున్న పరిస్థితుల్లో తిరిగి వాటిని వెనక్కు రప్పించడం సంస్థను ఇబ్బందులకు గురి చేసింది. ఈ రెండు సమస్యల్ని ఎదుర్కొని సంస్థ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఓ హున్‌ తన పదవికి రాజీనామా చేశారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App